పరవాసిని నే జగమున ప్రభువా — Paravaasini Ne Jagamuna Prabhuvaa | Telugu Christian Songs | Jesus Songs

Bekind — Telugu Christian Songs
1 min readSep 17, 2024

--

పరవాసిని నే జగమున ప్రభువా — Paravaasini Ne Jagamuna Prabhuvaa | Telugu Christian Songs | Jesus Songs.

Jesus

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.

పరవాసిని నే జగమున ప్రభువా (2)
నడచుచున్నాను నీ దారిన్
నా గురి నీవే నా ప్రభువా (2)
నీ దరినే జేరెదను
నేను.. నీ దరినే జేరెదను ||పరవాసిని||

లోకమంతా నాదని యెంచి
బంధు మిత్రులే ప్రియులనుకొంటిని (2)
అంతయు మోసమేగా (2)
వ్యర్ధము సర్వమును
ఇలలో.. వ్యర్ధము సర్వమును ||పరవాసిని||

ధన సంపదలు గౌరవములు
దహించిపోవు నీలోకమున (2)
పాపము నిండె జగములో (2)
శాపము చేకూర్చుకొనే
లోకము.. శాపము చేకూర్చుకొనే ||పరవాసిని||

తెలుపుము నా అంతము నాకు
తెలుపుము నా ఆయువు యెంతో (2)
తెలుపుము ఎంత అల్పుడనో (2)
విరిగి నలిగియున్నాను
నేను.. విరిగి నలిగియున్నాను ||పరవాసిని||

ఆ దినము ప్రభు గుర్తెరిగితిని
నీ రక్తముచే మార్చబడితిని (2)
క్షమాపణ పొందితివనగా (2)
మహానందము కలిగే
నాలో.. మహానందము కలిగే ||పరవాసిని||

యాత్రికుడనై ఈ లోకములో
సిలువ మోయుచు సాగెదనిలలో (2)
అమూల్యమైన ధనముగా (2)
పొందితిని నేను
యేసునే.. పొందితిని నేను ||పరవాసిని||

నా నేత్రములు మూయబడగా
నాదు యాత్ర ముగియునిలలో (2)
చేరుదున్ పరలోక దేశము (2)
నాదు గానము ఇదియే
నిత్యము.. నాదు గానము ఇదియే ||పరవాసిని||

About Our channel:

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు — Aandhra Kraisthava Keerthanalu Telugu Songs with Lyrics…

Exclusive Telugu Christian Songs — Andhra Christava Keerthanalu — Updating 100’s of Songs…
For more updates
Please do subscribe our channel: https://bit.ly/2zgchLZ

Follow us on our Social Sites:
Twitter: https://twitter.com/christiansongsz
Fb Page: https://www.facebook.com/bekindtelugusongs/
Blogger: https://bekindteluguchristiansongs.blogspot.com/
Instagram: https://www.instagram.com/bekindteluguchristiansongs/

--

--

Bekind — Telugu Christian Songs

Bekind — Telugu Christian Songs… Aandhra Kraisthava Keerthanalu Telugu Songs with Lyrics… Exclusive Telugu Christian Songs https://bit.ly/2zgchLZ